అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 10 Market Analysis | అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలతో పెరుగుతున్న చమురు ధరలు(Crude oil) ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచుతున్నాయి.
దీంతో గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) మాత్రం ఫ్లాట్ గా ఉండడంతో భారత బెంచ్‌మార్క్ సూచీలైన ప్రతికూల ధోరణితో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sep 10 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.64 శాతం, ఎస్ అండ్ పీ 0.48 శాతం పడిపోయాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.29 శాతం లాభంతో ఉంది.
Sep 10 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.98 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.69 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.33 నష్టంతో ముగిశాయి.
Sep 10 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.44 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.35 శాతం, జపాన్ Japan కు చెందిన నిక్కీ 0.92 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.91 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.57 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.33 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉండడంతో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 583 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు వరుసగా 22 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 1,509 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.83 నుంచి 0.75 కి తగ్గింది.
- విక్స్ 6.81 శాతం పెరిగి 11.92 వద్ద ఫ్లాట్‌గా ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు బలహీనపడి 95.11 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.19 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.75 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.85 వద్ద ఉన్నాయి.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.