Aug 19 Horoscope | కష్టానికి తగిన ప్రతిఫలం.. ఈ రాశుల వారిని వెతుక్కుంటూ రానున్న అదృష్టం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 19 Horoscope | గ్రహాల శుభ సంచారంతో ఇవాళ (ఆగస్టు 19, బుధవారం) పలు రాశుల వారి జాతకాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో కొందరికి అదృష్టం కలసివచ్చి అనుకోని ధనలాభం కలగడమే కాకుండా, చేపట్టిన పనుల్లో అద్భుత విజయాలు లభిస్తాయి. మరికొన్ని రాశుల వారు ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Aug 19 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Aug 19 Horoscope | ఎవరి సహాయం లేకుండానే సొంతంగా డబ్బు సంపాదిస్తారు. వ్యాపార భాగస్వాముల సహకారంతో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఇవాళ చేసే చిన్న ప్రయాణం మనశ్శాంతినిస్తుంది. బంధువు ఇంటికి వెళ్లడం వల్ల బిజీ లైఫ్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

వృషభ రాశి: Aug 19 Horoscope | ఇవాళ సరైన నిర్ణయాలు తీసుకుంటే అదనపు రాబడి పొందుతారు. వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు వస్తే పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం మంచిది.

మిథున రాశి: Aug 19 Horoscope | మీ జీవిత భాగస్వామి ఇచ్చే సర్‌ప్రైజ్ మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కొత్త పెట్టుబడి అవకాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.

న్యాయపరమైన (లీగల్) విషయాలలో లాయర్ సలహా తీసుకోవడానికి ఇది మంచి రోజు. మీ అభిప్రాయాలను పైఅధికారులకు చెబుతారు. మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది.

కర్కాటక రాశి: Aug 19 Horoscope | ఖర్చులు పెరిగుతాయి. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలించినా, భాగస్వాముల నుంచి కొంత వ్యతిరేకత ఎదురుకావచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం “ఓం శుక్రాయ నమః” అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి.

సింహ రాశి: Aug 19 Horoscope | శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగా, ధ్యానం చేయడం మంచిది. చిన్న వ్యాపారులకు చిన్నపాటి నష్టాలు వచ్చినా, నిరాశపడకుండా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు.

సెమినార్లు, ఎగ్జిబిషన్లలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు, విజ్ఞానం లభిస్తాయి. జీవిత భాగస్వామి వల్ల చిన్నపాటి ఇబ్బంది లేదా నష్టం కలగవచ్చు.

కన్యా రాశి: Aug 19 Horoscope | డబ్బు అధికంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. గోప్పవారి మద్దతు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. వ్యాపారవేత్తలతో కలిపి నూతన ప్రాజెక్ట్‌లు లేదా వెంచర్‌లు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. బంధువులతో సంబంధ బాంధవ్యాలను పునరుద్ధరించుకుంటారు.

AI Shiva Song Balochistan | నెట్టింట మార్మోగుతున్న’శివ బోలో.. బలూచిస్తాన్ ఆజాద్’: ఏఐ సృష్టించిన అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక గీతం!

తులా రాశి: Aug 19 Horoscope | అకస్మాత్తుగా ధనలాభం కలగడం వల్ల పెండింగ్ బిల్లులు, తక్షణ ఖర్చులు సులభంగా తీరిపోతాయి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి, ఆఫీసులో ప్రశంసలు పొందడానికి ఇది అనుకూలమైన రోజు. దగ్గరి వ్యక్తులు లేదా భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. మనశ్శాంతి కోసం కాలభైరవుడిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: Aug 19 Horoscope | మీలో శక్తి ఉత్సాహాలు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లు, పనులు పూర్తి చేసి చివరి దశకు తీసుకువస్తారు. కొత్త ఆర్థిక పథకాలు మీ ముందుకు వస్తాయి.

డబ్బు పెట్టుబడి పెట్టేముందు వాటి లాభనష్టాలను క్షుణ్ణంగా పరిశీలించండి. కుటుంబంలోకి కొత్త సభ్యులు రాబోతున్నారనే వార్త ఎంతగానో సంతోషాన్నిస్తుంది.

ధనుస్సు రాశి : పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ప్రాజెక్టులపై దృష్టి సారించండి.

మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ మాటలు ఇతరులను బాధించే అవకాశం ఉంది. బంధువుల జోక్యం వల్ల వైవాహిక జీవితంలో చిన్నపాటి అసంతృప్తి రావచ్చు.

మకర రాశి: ఇంట్లో శుభకార్యాలు లేదా కార్యక్రమాల వల్ల ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. ఆఫీసులో ముఖ్యమైన పనులను ఇతరుల సహాయం లేకుండా ఒక్కరే చేసేయగలనని భావిస్తే పొరపాటే. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి: మీ ఆశలు నెరవేరుతాయి. గతంలో మీరు పడిన కష్టానికి, తీసుకున్న శ్రమకు తగిన ప్రతిఫలం, అదృష్టం ఇవాళ లభిస్తాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆఫీసులో ఉత్సాహంగా పనిచేసి, అనుకున్న సమయం కంటే ముందే పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు, కాంటాక్ట్‌లు పెంచుకోవడానికి ఇది మంచి రోజు.

మీన రాశి: మీ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. విజయం మీకు దగ్గరలో ఉంది. ఇతరులు చెప్పే విషయాలను వినడం ద్వారా సమస్యలకు మంచి పరిష్కారాలు దొరుకుతాయి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురికావడం వల్ల మీ పనులకు కొంత ఆటంకం కలగవచ్చు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *