బిజినెస్​Tata Tiago EV | ఇది మిడిల్‌క్లాస్ ఈవీ కారు.. రూ.4.69 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన...

Tata Tiago EV | ఇది మిడిల్‌క్లాస్ ఈవీ కారు.. రూ.4.69 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన టాటా

మధ్యతరగతి కుటుంబాల ఎలక్ట్రిక్ కారు కలను సాకారం చేస్తూ టాటా కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది. టియాగో ఈవీని రూ.4.69 లక్షలకే అందుబాటులో ఉంచింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Tata Tiago EV | దేశీయ ఆటోమొబైల్ రంగ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors).. మధ్య తరగతి ప్రజలకోసం మరో కారును తీసుకువచ్చింది. కంపెనీలో అత్యంత ప్రజాదరణ పొందిన, చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీ అప్‌డేట్ వర్షన్‌ను విడుదల చేసింది. డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ పరంగా గణనీయమైన మార్పులు చేసింది. కొత్త టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ 2026 ఎక్స్ షోరూమ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది.

Tata Tiago EV | ‘బాస్ ’ పద్ధతిలో మరింత చౌక..

టాటా టియాగో ఈవీని మధ్య తరగతికి అందుబాటులో ఉంచేందుకు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బాస్) ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్ కింద కారు ధర రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ బాస్ మోడల్ ద్వారా కస్టమర్లు కారు ధరను తగ్గించుకుని, బ్యాటరీకి నెలవారీ సర్వీస్ రూపంలో కిలోమీటరుకు రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Tata Tiago EV | ఎక్స్‌టీరియర్ డిజైన్..

Tata Tiago EV

కొత్త టియాగో ఈవీ మరింత స్టైలిష్‌గా కనిపించేలా పలు మార్పులు చేశారు. ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, అలాగే వెనక భాగంలో కూడా రీడిజైన్ చేసిన రియర్ బంపర్లు కనిపిస్తాయి. ఫ్రంట్ డిజైన్‌లో మరో ముఖ్యమైన మార్పు కొత్తగా మూసివేయబడిన గ్రిల్. ఇది ఈవీకి ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇస్తుంది. దీంతో పాటు నలుపు రంగులో ఉన్న ఓఆర్ వీఎంలు, విండో లైన్ బ్లాక్ ఫినిష్‌లో ఉండడం వల్ల కారుకు స్పోర్టీ లుక్ వచ్చింది.
లైటింగ్ సెటప్ విషయానికి వస్తే ఐ బ్రో స్టైల్ ఎలఈడీ హెడ్‌ల్యాంప్, డీఆరఎల్స్ ఇచ్చారు. వెనకవైపు ఎలఈడీ టెయిల్‌లైట్స్ ఉన్నాయి.

ఇంటీరియర్  : ఇందులో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్యుయల్ వైర్‌లెస్ చార్జర్, ఆటో హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లున్నాయి.

Tata Tiago EV

Tata Tiago EV | భద్రత పరంగా

సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

బ్యాటరీ : కంపెనీ ఈ మోడల్‌ను మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందిస్తోంది. దీనిలో 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 62 హెచ్పీ శక్తిని, 110 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 75 హెచ్పీ పవర్‌ను, 114 ఎన్ ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

రేంజ్ : 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 285 కిలోమీటర్ల రేంజ్‌ను, 19.2 కేడబ్ల్యూహెచ్ సుమారు 226 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. 3.3 కేడబ్ల్యూ పోర్టబుల్ చార్జర్, 7.2 కేడబ్ల్యూ హోమ్ చార్జర్, 30 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్లతో లభిస్తుంది. 30 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జర్‌తో రెండు బ్యాటరీలను 35 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చని పేర్కొంటోంది.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | చివరలో సెల్లాఫ్.. భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...