అక్షరటుడే వెబ్డెస్క్: Telangana MLC Elections | తెలంగాణలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే సంవత్సరం మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ స్థానాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకునేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో గెలుపు వ్యూహాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కసరత్తు ప్రారంభించారు.
Telangana MLC Elections | సమర్థుడైన అభ్యర్థి కోసం..
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ పట్టభద్రుల స్థానం కోసం బలమైన , సమర్థుడైన అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు , ముఖ్య నాయకుల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. స్థానిక నాయకుల సూచనల ఆధారంగా సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేసి, పూర్తి నివేదికను పార్టీ అధిష్ఠానానికి అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. పార్టీ బలోపేతానికి స్థానిక నాయకుల అభిప్రాయాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
Telangana MLC Elections | ఓటరు నమోదుపై ప్రత్యేక ఫోకస్..
అభ్యర్థి ఎంపికతో పాటు పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లాలోని 15 నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలను మంత్రి పొన్నం ఆదేశించారు. అర్హులైన ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా నాయకులు సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ప్రారంభించడం జరిగింది
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా కీలకమైన అభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించాను.
పట్టభద్రుల…
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 4, 2026
ఇది కూడా చదవండి: Balkonda Healthcare | వైద్యారోగ్యానికి గ్రహణం.. బాల్కొండ ప్రజలపై నిర్లక్ష్యం