అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congress Created Drought | ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం ఉన్నాయన్నారు. తమ మీద కోపంతో రేవంత్‌రెడ్డి నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అన్ని జలాశయాలు నింపొచ్చని కేటీఆర్ అన్నారు. తమ మీద కక్షతో రైతుల నోట్లో మట్టి కొట్టొద్దని కోరారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయన్నారు. మరో 100 రోజులు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
Congress Created Drought | రోజుకు 2 టీఎంసీలు..
వంద రోజుల్లో రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల లిఫ్ట్ చేస్తే, గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. గురువు చంద్రబాబు కోసం నీళ్లు కిందకి వదులుతున్నావా అని రైతులు అడిగితే దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Congress Created Drought | బుర్ర కూడా తక్కువే.
రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నా బుర్ర కూడా తక్కువే అని కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ 2014 నుండి 3 సార్లు ఓడిపోయాడని, దేశంలో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా అని ప్రశ్నించారు. గోదావరిలో కళ్ల ముందు లక్ష క్యూసెక్కుల నీళ్లు వరదలాగా కిందకి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం వల్ల మునిగే భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డ వల్ల మునిగిపోతుంది అంటున్న సీఎంకు బుద్ధి లేదన్నారు.
Congress Created Drought | కేసీఆర్ తయారు చేసిన సైనికుడు_
హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడని కేటీఆర్ అన్నారు. పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండి రక్షణ కవచంగా నిలిచిన వ్యక్తి అని పేర్కొన్నారు. హరీష్ రావు మీద వచ్చిన పుకార్లను కొన్ని వందల సార్లు తిప్పి కొట్టారని గుర్తు చేశారు. ‘‘నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు పార్టీలో మారిండు, ఆయన మాట్లాడితే ఎట్లా అని’’ హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు.. రాత్రికి బీజేపీ వాళ్ళతో ఉంటాడని ఎద్దేవా చేశారు. శీల పరీక్ష చేయాలంటే ముందు రేవంత్ రెడ్డికి చేయాలన్నారు.
ఇది కూడా చదవండి..: RS Praveen Kumar | సీఎం వెంటనే రాజీనామా చేయాలి : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్