educationNEET Re Exam | జూన్​ 21న నీట్​ పరీక్ష.. ఎన్​టీఏ కీలక ప్రకటన

NEET Re Exam | జూన్​ 21న నీట్​ పరీక్ష.. ఎన్​టీఏ కీలక ప్రకటన

నీట్​ పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో జూన్​ 21న పరీక్ష పెడుతామని తెలిపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Re Exam | నీట్​ పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో జూన్​ 21న ఆదివారం మళ్లీ పరీక్ష పెడుతామని తెలిపింది.దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో (Medical Colleges) ఎంబీబీఎస్​ సీట్ల భర్తీ కోసం మే 3న నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పేపర్​ లీకేజీ కావడంతో ఎన్​టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది.

మళ్లీ ఎగ్జామ్​ పెడుతామని ప్రకటించింది. ఈ మేరకు కొత్త పరీక్ష తేదీ వివరాలను తాజాగా వెల్లడించింది. గతంలో నిర్వహించిన పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ఎగ్జామ్ క్యాన్సల్ కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జూన్​ 21న పరీక్ష పెడతామని ఎన్​టీఏ తెలిపింది. పరీక్షకు సంబంధించిన ప్రామాణికమైన తాజా సమాచారం, వివరాల కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు తమ అధికారిక సమాచార మాధ్యమాలపై మాత్రమే ఆధారపడాలని సూచించింది.

NEET Re Exam | లీకేజీపై నిరసనలు

దేశంలో మే 3న జరిగిన నీట్​ పరీక్ష లీకేజీ (NEET Exam Leak)పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఎన్​టీఏ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.లక్షలు పెట్టి కోచింగ్​ తీసుకుంటున్న తమ భవిష్యత్​తో ప్రభుత్వం ఆడుకుంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్​, ఇతర పార్టీల నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. అయితే మే 3న పరీక్షకు కొన్ని రోజుల ముందే ప్రశ్నాపత్రం లీక్​ అయింది. దానిని పలువురు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గెస్​ పేపర్​ పేరిట సోషల్​ మీడియాలో దానిని వైరల్ చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. దీనిపై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana ANM Results | ఏఎన్​ఎం పరీక్ష ఫలితాలు విడుదల

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Stock Market Gains | ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐటీ షేర్లలో...

Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి...

Modi Foreign Tour | ఐదు దేశాల పర్యటనకు బయలు దేరిన మోదీ.. కీలక అంశాలపై చర్చించనున్న ప్రధాని

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Foreign Tour | ప్రధాని నరేంద్ర...

Meta Layoffs | 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meta Layoffs | ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా...