UncategorizedCensus self enumeration | స్వీయ జనగణనలో పాల్గొన్న సీఎం

Census self enumeration | స్వీయ జనగణనలో పాల్గొన్న సీఎం

జనగణనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Census self enumeration | జనగణన 2027లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వీయ నమోదు (Self-Enumeration) కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.

Census self enumeration | అందరూ పాల్గొనాలి

జనగణన అధికారులు ముఖ్యమంత్రికి స్వీయ నమోదు విధానాలు, ప్రాముఖ్యత గురించి వివరించారు. కచ్చితమైన, సమర్థవంతమైన వివరాల సేకరణలో ఈ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభావవంతమైన ప్రణాళిక, అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అందరూ జనగణన ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగణన కార్యకలాపాల సంచాలకులు భారతి హోలికేరి (Bharathi Holikeri), GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, సంయుక్త ప్రధాన జనగణన అధికారి ప్రియాంక ఆలా (ZC ఖైరతాబాద్), I&PR కమిషనర్ ప్రియాంక పాల్గొన్నారు.

cm revanth reddy 2

కాగా రాష్ట్రంలో జన గణన ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల వివరాలు సేకరిస్తారు. అయితే ఆన్​లైన్ ద్వారా ప్రజలు సైతం నేరుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ సారి ఈ ప్రక్రియను ప్రవేశ పెట్టారు. సెల్ఫ్​ ఎన్యుమరేటర్​తో ప్రజలు తమ వివరాలను పక్కాగా నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

దీనిని కూడా చదవండి : SI Suspended | అన్న అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్సై.. సస్పెండ్​ చేసిన అధికారులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....