అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Lavrov Meeting | రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు.
రష్యా విదేశాంగ మంత్రి బుధవారం భారత్‌కు వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి జై శంకర్ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో గురువారం ఆయన మోదీతో పలు విషయాలపై చర్చించారు. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో డిసెంబర్ 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైనప్పటి నుంచి ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి గురించి లావ్రోవ్ మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిక్స్ (BRICS) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు లావ్రోవ్ వచ్చారు
Modi Lavrov Meeting | ఆనందంగా ఉంది
రష్యా (Russia) విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. మా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలలో సాధించిన పురోగతిపై సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశామని పేర్కొన్నారు.
Pleased to receive Russia’s Foreign Minister Sergei Lavrov. Thanked him for an update on the progress on various facets of our Special & Privileged Strategic Partnership.
We also exchanged views on various regional and global issues, including situation in Ukraine and West… pic.twitter.com/fg9YL1b0Se
— Narendra Modi (@narendramodi) May 14, 2026
దీనిని కూడా చదవండి : Trump Secret Letter | ట్రంప్ పర్యటన వేళ జేడీ వాన్స్‌కు ‘సీక్రెట్ లెటర్’.. అందులో ఏముంది?


