KOSPI Surge | నాలుగున్నర నెలల్లో డబుల్..! వంద శాతం పెరిగిన దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KOSPI Surge | దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ అద్భుతమైన పనితీరుతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది. మెమరీ తయారీ సంస్థలైన ఎస్కే హైనిక్స్ ఇంక్., శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో (Samsung Electronics Co). లలో వచ్చిన పురోగతితో ఊపందుకున్న బెంచ్‌మార్క్ ఇండెక్స్ కోస్పి.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ సాగుతోంది. ఈ సంవత్సరం తొలి అర్ధభాగం కూడా గడవకముందే వంద శాతం పెరిగి డాట్‌కామ్ యుగం రికార్డుకు చేరువయ్యింది.

KOSPI Surge | ఏడాదిలో 211 శాతం పెరుగుదల..

సౌత్ కొరియా (South Korea)కు చెందిన కోస్పీ ఏడాదిగా జోరుమీదుంది. 52 వారాల కనిష్టస్థాయి 2,689 పాయింట్లు కాగా.. 52 వారాల గరిష్ట స్థాయి 8,457 పాయింట్లు. బుధవారం 8,228 పాయింట్ల వద్ద స్థిరపడింది. కేవలం మెమరీ తయారీ సంస్థలైన ఎస్కే హైనిక్స్ ఇంక్., శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో.ల వల్లే కోస్పీ ఈ స్థాయిలో పెరగడం గమనార్హం.

KOSPI Surge | బబులేనా?

1999లో అమెరికాలోని నాస్‌డాక్ 100 ఇండెక్స్ 102 శాతం పెరిగింది. అమెరికా పారిశ్రామిక వృద్ధి సమయంలో కనిపించిన చరిత్రాత్మక పెరుగుదల ఇది. ఆ సమయంలోనే డాట్‌కామ్ బబుల్ బరస్ట్ అయ్యింది. ప్రస్తుతం దక్షిణ కొరియా మార్కెట్ సైతం అదే స్పీడ్‌తో పెరుగుతోంది. అయితే 1999లో జరిగినట్లు ఇది కూడా బబుల్ (అతిగా విలువ పెరగడం) కావచ్చన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Neurosurgeon Suspension | రోగితో అనైతిక సంబంధం.. సీనియర్ న్యూరోసర్జన్‌పై చర్యలు, 8 నెలల సస్పెన్షన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *