బిజినెస్​Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 914 పాయింట్లు, నిఫ్టీ 258 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం ప్రకటించారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచే అవకాశాలు ఉండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చాయి. అయితే ఒప్పందం తాలూకు నిబంధనలు, షరతులపై స్పష్టత లేనప్పటికీ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో సూచీలు పరుగులు తీస్తున్నాయి.

Stock Market Gains | గ్యాప్ అప్‌లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 720 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 38 పాయింట్లు తగ్గినా తిరిగి పుంజుకుని మరో 289 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 221 పాయింట్ల లాభంతో ప్రారంభమె తొలుత 18 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి మరో 73 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 914 పాయింట్ల లాభంతో 76,330 వద్ద, నిఫ్టీ 258 పాయింట్ల లాభంతో 23,977 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి.

నిఫ్టీ (Nifty)లో బ్యాంక్ నిఫ్టీ 1.89 శాతం, టెలికాం 1.88 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.74 శాతం, ఆటో 1.57 శాతం, మీడియా ఇండెక్స్ 1.50 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 స్టాక్స్ లాభాలతో, 2 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్ 2.71 శాతం, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్ 2.41 శాతం, ఎల్టీ 2.32 శాతం, ఎంఅండ్ ఎం 2.12 శాతం, ఇండిగో 1.93 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers : టీసీఎస్ 0.15 శాతం, సన్‌ఫార్మా 0.02 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Realme 16T 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Stock Market india | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market india | దేశీయ స్టాక్ మార్కెట్...

హైదరాబాద్‌ టెక్‌ అద్భుతం.. గాల్లోకి లేవనున్న భారీ కార్గో విమానం ‘జెన్ #2’

హైదరాబాద్‌కు చెందిన డీప్‌-టెక్ ఏరోస్పేస్ స్టార్టప్ 'బ్లూజే ఏరోస్పేస్' (BluJ Aerospace)...

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాలు షురూ

ప్రముఖ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన సిబ్బంది కోసం సరికొత్త...

Armoor Officials Transfer | ఆర్మూర్ బల్దియాలో ముగ్గురు అధికారుల బదిలీ..

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Officials Transfer | ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో...