Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

EPFO Auto Settlement | పీఎఫ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎలాంటి అప్లికేషన్ లేకుండానే అకౌంట్లోకి డబ్బులు..

Shivam nagarani
Last updated: November 6, 2026, 5:07 pm 5:07 pm
Shivam nagarani
Share
EPFO Auto Settlement

అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO Auto Settlement | ప్రైవేట్ ఉద్యోగుల పీఎఫ్ (EPF) ఖాతాలకు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు మారినప్పుడు లేదా పాత పీఎఫ్ ఖాతాలను పట్టించుకోకుండా వదిలేసినప్పుడు అవి కాలక్రమేణా ఇనాక్టివ్ అయిపోతాయి. ఇలాంటి ఖాతాల్లో చిక్కుకుపోయిన సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై వినియోగదారులు ప్రత్యేకంగా ఎలాంటి క్లెయిమ్ సమర్పించాల్సిన అవసరం లేదని, నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే ఆటోమేటిక్‌గా జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

EPFO Auto Settlement | ఎవరికి వర్తిస్తుంది?

ఈ ఆటో సెటిల్మెంట్ సౌకర్యం కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలో రూ. 1,000 లేదా అంతకంటే తక్కువ మొత్తం ఉన్న ఖాతాదారులకు మాత్రమే ఇది నేరుగా వర్తిస్తుంది. ఒకవేళ ఖాతాలో వేయి రూపాయల కంటే ఎక్కువ నిధులు ఉంటే మాత్రం ఈ ఆటో విధానం వర్తించదు. అలాంటి వారు పాత పద్ధతిలోనే సాధారణ క్లెయిమ్ దరఖాస్తు చేసుకొని డబ్బులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా పీఎఫ్ రికార్డులలో నమోదైన కేవైసీ (KYC) వివరాలు , బ్యాంక్ ఖాతా వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ఆ సొమ్మును నేరుగా సదరు లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్‌కే బదిలీ చేస్తారు.

EPFO Auto Settlement | సుమారు లక్ష మందికి లబ్ధి..

ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 1,000,000 (లక్ష) మంది పీఎఫ్ ఖాతాదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుండగా, దాదాపు రూ. 5 కోట్ల వరకు జమ కానున్నాయి. చిన్న మొత్తాలు కావడంతో చాలామంది ఉద్యోగులు వీటిని విత్‌డ్రా చేసుకోకుండా వదిలేస్తుంటారు. అలాంటి నిధులను వేగంగా క్లియర్ చేసే లక్ష్యంతో ఈ ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చారు.

EPFO Auto Settlement | ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుంది?

1952 ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం, ఒక పీఎఫ్ ఖాతాలో వరుసగా మూడేళ్ల (36 నెలల) పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా లేదా కంపెనీ నుంచి చందా జమ కాకపోయినా ఆ ఖాతా ఇనాక్టివ్ అవుతుంది. సాధారణంగా ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన తర్వాత లేదా ఉద్యోగం మానేసిన తర్వాత సుదీర్ఘకాలం డిపాజిట్లు లేకపోతే దానిని నిష్క్రియ ఖాతాగా పరిగణిస్తారు. అటువంటి ఖాతాల నుంచి సాధారణ పద్ధతిలో డబ్బులు తీయడం కుదరదు కాబట్టి, చిన్న మొత్తాల కోసం ఈపీఎఫ్ఓ ఈ సులువైన మార్గాన్ని తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి:  Indian Stock Market | ఏడో రోజూ పైపైకి.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

TAGGED:Employee Provident FundEPF WithdrawalEPFO Auto SettlementEPFO Latest UpdatesInactive PF AccountsKYC Verificationlatest newsPF Account BalanceProvident Fund Newstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Indian Stock Market Indian Stock Market | ఏడో రోజూ పైపైకి.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
Next Article Armoor RDO Office Armoor RDO Office | ఆర్మూర్‌ ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు భవనం మంజూరు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Krishna Peacock Feather
భక్తి

Krishna Peacock Feather | శ్రీకృష్ణుడు కిరీటంలో నెమలి ఈక ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యమిదే!

By Shivam nagarani
AI Soft Robots
బిజినెస్​

AI Soft Robots | పైపుల్లో ఈదుతూ లీకేజీలు గుర్తించే ‘ఏఐ రోబోలు’.. ఈల్ చేపల స్ఫూర్తితో క్రేజీ రీసెర్చ్

By Shivam nagarani
Khairatabad Bypoll
తెలంగాణ

Khairatabad Bypoll | దానం నాగేందర్ కామెంట్స్ తో నాకు సంబంధం లేదు: విజయారెడ్డి

By Shivam nagarani
June 27 Gold Prices
బిజినెస్​

June 27 Gold Prices | బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.