Congress Organisational Reshuffle | కాంగ్రెస్ పార్టీలో భారీ సంస్థాగత మార్పులు.. పలు రాష్ట్రాలకు ఇన్​ఛార్జుల నియామకం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నియామకాల వివరాలను వెల్లడించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress Organisational Reshuffle | వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం పలు రాష్ట్రాల వ్యవహారాల ఇన్​ఛార్జులను మారుస్తూ శనివారం (సెప్టెంబరు 5, 2026) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నియామకాల వివరాలను వెల్లడించారు.

Congress Organisational Reshuffle | కీలక నాయకుల బాధ్యతలు, మార్పులు..

పంజాబ్​కు సచిన్ పైలట్: రాజస్థాన్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. ఇప్పటివరకు అక్కడ ఇన్​ఛార్జిగా​ ఉన్న ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్థానంలో పైలట్‌ను నియమించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

అస్సాంలో భూపేష్ బఘేల్: పంజాబ్ ఇన్​ఛార్జి బాధ్యతల నుంచి ఉపశమనం పొందిన భూపేష్ బఘేల్‌కు అస్సాం రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను కట్టబెట్టారు.

ఆంధ్రప్రదేశ్​కు పీవీ మోహన్: కర్ణాటకకు చెందిన సీనియర్ నేత, గతంలో కేరళ, లక్షద్వీప్ వ్యవహారాలను పర్యవేక్షించిన పీవీ మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్​ఛార్జిగా నియమించారు.

మహారాష్ట్రకు సిరివెళ్ల ప్రసాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఐసీసీ కార్యదర్శి, గతంలో జార్ఖండ్ వ్యవహారాలు చూసిన డాక్టర్ సిరివెళ్ల ప్రసాద్‌కు మహారాష్ట్ర బాధ్యతలు దక్కాయి.

ఛత్తీస్‌గఢ్​కు సుఖ్‌దేవ్ భగత్: జార్ఖండ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్​ఛార్జిగా నియమించారు.

Nepal Flood Rescue | నేపాల్ వరదల్లో అద్భుతం: 10 రోజులు బురదలోనే.. 11వ రోజు పునర్జన్మ! కూలిన నాలుగు అంతస్తుల భవనం నుంచి వృద్ధురాలు సురక్షితం

Congress Organisational Reshuffle | రాబోయే ఎన్నికలకు సన్నద్ధం..

ఈ మార్పులతో పాటు గుజరాత్ కాంగ్రెస్ ఇన్​ఛార్జిగా రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ.. రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకే ఈ నూతన నాయకత్వాన్ని రంగంలోకి దించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *