అక్షరటుడే, వెబ్‌డెస్క్: Zee Entertainment Downfall Story | భారతదేశంలో ప్రైవేట్ టెలివిజన్ రంగానికి ప్రాణం పోసిన మీడియా టైకూన్ డాక్టర్ సుభాష్ చంద్ర Dr. Subhash Chandra. 1992లో దేశంలో కేవలం దూరదర్శన్ Doordarshan మాత్రమే ఉన్న సమయంలో ‘జీ టీవీ’ (Zee TV) ని స్థాపించి, కోట్ల మంది భారతీయుల లివింగ్ రూమ్‌లలోకి వినోదాన్ని తీసుకొచ్చారు.
ప్యాకేజింగ్ వ్యాపారంతో ప్రస్థానం ప్రారంభించి, దేశంలోనే తొలి అమ్యూస్‌మెంట్ పార్క్ ‘ఎస్సెల్ వరల్డ్’ స్థాపించిన ఆయన, జీ టీవీ ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించి బిలియనీర్‌గా ఎదిగారు. అయితే, నేడు అదే మీడియా సామ్రాజ్యం నిధుల మల్లింపు ఆరోపణలు, సెబి (SEBI) ఆంక్షలు, తీవ్రమైన అప్పుల సంక్షోభంలో కూరుకుపోయింది.
Miss World 2026 Winner | మిస్ వరల్డ్-2026 విజేతగా డొమినికన్ రిపబ్లిక్ భామ జోహైరీ మోలా
Zee Entertainment Downfall Story | ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అడుగు
ఈ పతానానికి ప్రధాన కారణం జీ గ్రూప్ వ్యాపార విస్తరణ వ్యూహమే. లాభదాయకమైన మీడియా వ్యాపారం నుంచి జీ గ్రూప్ పవర్, రోడ్లు, సోలార్ ఎనర్జీ వంటి భారీ మౌలిక సదుపాయాల రంగంలోకి విస్తరించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు తీసుకున్నారు.
ఈ అప్పులకు గ్యారెంటీగా సుభాష్ చంద్ర తన జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ షేర్లను బ్యాంకులలో తాకట్టు పెట్టారు. కానీ, 2018 నాటి IL&FS సంక్షోభం కారణంగా క్రెడిట్ మార్కెట్ దెబ్బతినడంతో, గ్రూప్ అప్పులు తీర్చలేకపోయింది. దీంతో తాకట్టు ఉన్న షేర్లను బ్యాంకులు విక్రయించాయి. ఫలితంగా 40% పైగా ఉన్న ప్రమోటర్ల వాటా సుమారు 4%కి పడిపోయి, కంపెనీపై కుటుంబ నియంత్రణ కోల్పోయారు.
Zee Entertainment Downfall Story | నిధుల మల్లింపు వివాదం
2023లో సెబి, సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయంకాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ కు చెందిన ₹200 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎస్సెల్ గ్రూప్ ప్రైవేట్ రుణాల సర్దుబాటుకు యెస్ బ్యాంక్ ఉపయోగించుకుంది.
ఈ నిధులను భర్తీ చేసేందుకు కాగితాలపై నకిలీ లావాదేవీలు సృష్టించి తిరిగి కంపెనీకే నిధులు వచ్చినట్లు చూపించారని సెబి ఆరోపించింది. దీనివల్ల వీరిద్దరూ కీలక డైరెక్టర్ పదవులు చేపట్టకుండా సెబి ఆంక్షలు విధించగా.. తదనంతరం సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (SAT) నుంచి కొంత ఊరట లభించింది.
Zee Entertainment Downfall Story | సోనీ (Sony) డీల్ రద్దు
తీవ్ర దెబ్బ సంక్షోభం నుంచి బయటపడటానికి జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ (Sony Pictures) తో 10 బిలియన్ డాలర్ల మెగా విలీనానికి ఒప్పందం చేసుకుంది. ఇది పూర్తయితే దేశంలోనే అతిపెద్ద మీడియా దిగ్గజం ఏర్పడేది. అయితే, సెబి విచారణలు, విలీన కంపెనీకి పునీత్ గోయంకా సీఈఓగా కొనసాగాలనే వివాదం కారణంగా.. జనవరి 2024లో సోనీ ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు ఒక్కరోజులోనే 30% పైగా కుప్పకూలాయి.
సొంత మీడియా వ్యాపారంలో ఎంతటి విజయం సాధించినప్పటికీ, సరైన అవగాహన లేకుండా అప్పులతో ఇతర రంగాల్లోకి విస్తరించడం, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు ఎంతటి సామ్రాజ్యాన్నైనా ప్రమాదంలో పడేస్తాయని ఈ ‘జీ’ సంక్షోభం కార్పొరేట్ ప్రపంచానికి ఒక పెద్ద పాఠంగా నిలిచింది.