Narayankhed Model Schools | కోటక్ మహీంద్రా బ్యాంక్ అద్భుత సేవ.. తెలంగాణలో ఆధునీకరించిన 5 ప్రభుత్వ పాఠశాలలు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Narayankhed Model Schools | తెలంగాణలోని  ( Telangana )సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (KMBL), యునైటెడ్ వే బెంగళూరు (UWBe), తెలంగాణ ప్రభుత్వ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ‘మోడల్ స్కూల్ ప్రాజెక్ట్’ కింద ఐదు ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాయి. ఈ విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా ఆ ప్రాంతంలోని దాదాపు 2,200 మంది విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన అభ్యాస వాతావరణం లభించనుంది. పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.

Narayankhed Model Schools | అభివృద్ధి చేసిన వసతులు..

తరగతి గదులు, హాస్టళ్లు, కారిడార్లు, కిచెన్లు, డైనింగ్ ఏరియాలు , మరుగుదొడ్లలో సమగ్ర సివిల్, ఎలక్ట్రికల్ , స్ట్రక్చరల్ పనులు చేపట్టారు. భవనాల మరమ్మతులు, రంగులు వేయడం, వాటర్‌ప్రూఫింగ్, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశారు. తాగునీరు, పారిశుద్ధ్య (WASH) సదుపాయాలను మెరుగుపరిచారు. విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక తరగతి గది మౌలిక సదుపాయాలను కల్పించారు.

Narayankhed Model Schools | ప్రారంభోత్సవం..

నారాయణఖేడ్‌లోని పోతులబోగుడలో ఉన్న తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలను సంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి (DEO) శ్రీమతి రధికాంతి రోహిణి ప్రారంభించారు. స్థానిక యంత్రాగనం, కోటక్ మహీంద్రా బ్యాంక్ , యునైటెడ్ వే బెంగళూరు ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Narayankhed Model Schools | సీయస్సార్ కింద కీలక ప్రాజెక్ట్..

కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) అజెండాలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పిల్లలు చదువుకునే వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా బలమైన పునాది వేయడానికి బ్యాంక్ కృషి చేస్తోంది. కమ్యూనిటీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ సీయస్సార్ ప్రధాన ఉద్దేశమని బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సందర్భంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ గ్రూప్ సీయస్సార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిధి భాటియా మాట్లాడుతూ.. “పిల్లలు తమ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి సురక్షితమైన వాతావరణం అత్యవసరం. మా భాగస్వామ్యంతో పాఠశాలలకు బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు. అలాగే యునైటెడ్ వే బెంగళూరు సీఈఓ రాజేష్ క్రిష్ణన్ మాట్లాడుతూ.. సురక్షితమైన, సమ్మిళిత వాతావరణంలో విద్యనభ్యసించే హక్కు ప్రతీ పిల్లాడికి ఉందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్నామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Paddy Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *