అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PM Surya Ghar Seva Setu | ప్రధానమంత్రి సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై నగరంలోని (Nizamabad) పవర్ హౌస్‌లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
PM Surya Ghar Seva Setu | మూడురోజుల పాటు అవగాహన శిబిరం..
ఈ సందర్భంగా ట్రాన్స్‌కో ఎస్ఈ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు ఆన్-ది-స్పాట్ నమోదు ప్రక్రియ చేపట్టేందుకు పవర్‌హౌస్‌లో మూడురోజుల ‘సేవా సేతు’ శిబిరాలు గురువారం ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
PM Surya Ghar Seva Setu | అన్ని సదుపాయాలు ఒకేచోట..
ఈ శిబిరాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ, బ్యాంకింగ్ రుణాలు, అధీకృత సోలార్ విక్రేతల మార్గదర్శకత్వాన్ని ఒకే చోట అందిస్తున్నామన్నారు. 1 కిలోవాట్ సోలార్ వ్యవస్థకు రూ. 30,000, 2 కేవీకి రూ.60,000, 3కేవీ అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా రూ.78,000 వరకు కేంద్ర సబ్సిడీ లభిస్తుందని ఆయన తెలిపారు. అక్టోబర్ 1 నుండి 3 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ఈ సేవా సేతు శిబిరాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్ఈడీసీవో( TGEREDCO) మేనేజర్ రవీందర్ చవాన్, వివిధ బ్యాంక్‌ల అధికారులు, సోలార్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!