Hindu Puja Rituals | గుడి నుంచి నేరుగా ఇంటికే వెళ్లాలి అంటారు.. ఎందుకో తెలుసా?

మన ఇళ్లలో రోజూ పూజలు చేయడం, పండుగలకు దేవుణ్ని కొలవడం, గుళ్లకు వెళ్లడం ఎప్పూటి నుంచో ఉన్న ఆచారమే.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hindu Puja Rituals | మన ఇళ్లలో రోజూ పూజలు చేయడం, పండుగలకు దేవుణ్ని కొలవడం, గుళ్లకు వెళ్లడం ఎప్పూటి నుంచో ఉన్న ఆచారమే. అయితే ఈ పూజా విధానాలు, సంప్రదాయాల వెనుక కొన్ని ప్రత్యేకమైన భావనలు ఉంటాయి. ఆచారాలను కేవలం భయంతో లేదా గుడ్డిగా పాటించకుండా, వాటి వెనుక ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఆలయ దర్శనం, పూజలు, పితృదేవతల ఫొటోల ఏర్పాటు వంటి పలు సందేహాలపై నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి.

Hindu Puja Rituals | ఇంటికే ఎందుకు వెళ్లాలి?

దేవాలయానికి  ( Temple )వెళ్లినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి దృష్టి దైవంపై పూర్తిగా కేంద్రీకృతమవుతుంది. ఈ ఆధ్యాత్మిక వాతావరణం, ప్రశాంతతను దర్శనం పూర్తయిన వెంటనే కోల్పోకూడదనే ఉద్దేశంతోనే గుడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. అంతేతప్ప, గుడికి వెళ్లి వచ్చిన వెంటనే ఎక్కడికీ వెళ్లకూడదనే కఠినమైన రూల్ ఏమీ లేదని, ఆ ప్రశాంతతను ఇంట్లో కూడా కొనసాగించాలనేదే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టమవుతోంది.

Hindu Puja Rituals | ఎక్కువ పూజలు చేస్తే ..

పూజలు, వ్రతాలు చేస్తున్నప్పటికీ జీవితంలో సమస్యలు వస్తే “ఇన్ని పూజలు చేసినా కష్టాలు ఎందుకు వస్తున్నాయి?” అని కొందరు నిరాశపడుతుంటారు. మరికొందరు “ఎక్కువ పూజలు చేస్తే దేవుడు ఎక్కువ పరీక్షలు పెడతాడు” అని నమ్ముతుంటారు. అయితే పూజలు చేయడం వల్ల కష్టాలు పెరుగుతాయనడం కేవలం అపోహ మాత్రమే. జీవితంలో సుఖదుఃఖాలు అనేవి సహజమని, వాటిని మన కర్మఫలితాలతో ముడిపెట్టి చూడాలి. దేవుడిపై నమ్మకం, భక్తి మనిషిలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంచుతాయే తప్ప, కష్టాలకు పూజలకు ఎలాంటి సంబంధం ఉండదు.

Hindu Puja Rituals | పూజల్లో ఆడంబరం అవసరమా?

దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి భారీగా పూజా సామగ్రిని వాడటం, పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పిస్తేనే మంచిదని చాలా మంది భావిస్తుంటారు. కానీ వస్తువుల సంఖ్య, ఆడంబరం కంటే మనసులోని భక్తి, శ్రద్ధ, విశ్వాసమే ముఖ్యం. నిష్కల్మషమైన మనసుతో చేసే చిన్న పూజకైనా దేవుడు కరిగిపోతాడని, భక్తిని ఆడంబరాలతో ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.

Hindu Puja Rituals | పూర్వీకుల ఫొటోలను పూజా గదిలో పెట్టవచ్చా?

మరణించిన కుటుంబ పెద్దల ఫొటోలను ఎక్కడ పెట్టాలనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి. దేవతారాధన, పితృస్మరణ వేర్వేరు ఆచారాలు. పూర్వీకులను గౌరవించడం మన సంప్రదాయంలో భాగమని, కుటుంబ పెద్దల చిత్రపటాలను పూజా స్థలంలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఆ ఫొటోలను మాత్రం దక్షిణ దిశలో ఉంచాలని, వాటి పరిమాణం చాలా పెద్దవిగా కాకుండా తక్కువ సైజులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Danam Nagender Votes | హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన హెచ్చరిక

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *