Hyundai BAYON | హ్యుందాయ్ నుంచి మరో అద్భుతమైన ఎస్‌యూవీ.. లుక్ అదుర్స్

తమ రాబోయే ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్ పేరు ‘హ్యుందాయ్ బేయాన్’ (Hyundai BAYON) అని ఇటీవల ప్రకటించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL), తాజాగా ఆ వాహనానికి సంబంధించిన మొట్టమొదటి డిజైన్ స్కెచ్‌లను విడుదల చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyundai BAYON | తమ రాబోయే ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్ పేరు ‘హ్యుందాయ్ బేయాన్’ (Hyundai BAYON) అని ఇటీవల ప్రకటించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL), తాజాగా ఆ వాహనానికి సంబంధించిన మొట్టమొదటి డిజైన్ స్కెచ్‌లను విడుదల చేసింది. గ్లోబల్ ప్రొడక్ట్‌గా అభివృద్ధి చేసిన ఈ బేయాన్.. బలమైన ఎస్‌యూవీ గుర్తింపు, బోల్డ్ డిజైన్ , నగరాల్లో సులువుగా ప్రయాణించే వీలుతో సరికొత్త మొబిలిటీ అనుభూతిని అందించనుంది. ఈ స్కెచ్‌లు హ్యుందాయ్ అభివృద్ధి చేసిన ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ (Art of Steel) డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఆధునిక లైఫ్‌స్టైల్‌కు సరిపోయేలా స్పోర్టీ, స్టైలిష్‌ లుక్‌లో దీనిని తీర్చిదిద్దారు.

Hyundai BAYON | హెచ్-ఎడ్జ్ లైటింగ్..

హ్యుందాయ్ డిజైన్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ సైమన్ లోయాస్బీ మాట్లాడుతూ.. “భారతదేశంలోకి బేయాన్‌ను పరిచయం చేస్తున్న తరుణంలో, ఇది మొదటి చూపులోనే అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని భావించాము. ఇంటెలిజెంట్ టెక్నాలజీ, ఆలోచనాత్మక డిజైన్ కలగలిపిన ఒక అద్భుతమైన ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్‌ను తీసుకొవడమే మా లక్ష్యం. కఠినమైన బాహ్య రూపంతో పాటు హైటెక్ ఇంటీరియర్‌ను దీనిలో జోడించాము. బాడీ డిజైన్, బోల్డ్ ఫెండర్లు , హెచ్-ఎడ్జ్ లైటింగ్ దీనికి మరింత బలాన్ని చేకూరుస్తాయి” అని పేర్కొన్నారు.

Hyundai BAYON | డిజైన్ స్కెచ్‌లు ..

హ్యుందాయ్ బేయాన్ డిజైన్ స్కెచ్‌లు ఒక బలమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన అర్బన్ ఎస్‌యూవీ ( SUV ) రూపాన్ని కళ్లకు కడుతున్నాయి. ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ ఫిలాసఫీతో స్కెచ్ చేసిన ఈ కారు.. మజిల్ ప్రొఫైల్స్, షార్ప్ క్యారెక్టర్ లైన్స్‌తో స్టైలిష్‌గా , యూూత్‌ఫుల్‌గా కనిపిస్తోంది.ముందు భాగం బోల్డ్ ఎస్‌యూవీ స్టాన్స్‌తో, ప్రత్యేకమైన ‘హెచ్-ఎడ్జ్’ లైటింగ్ సిగ్నేచర్‌తో ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తోంది. లోపలి క్యాబిన్ ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా అత్యంత వినూత్నంగా, ఇంటెలిజెంట్‌గా డిజైన్ చేశారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లతో టెక్-సేవి కస్టమర్లకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

Hyundai BAYON | సిటీ డ్రైవింగ్‌కు సరిపోయేలా..

నగరాల్లో నిత్యం ప్రయాణించే కస్టమర్ల కోసం అసలైన ఎస్‌యూవీ అనుభూతిని అందించాలనే ఆలోచనతో హ్యుందాయ్ బేయాన్‌ను రూపొందించారు. ఇది ఎస్‌యూవీకి ఉండే పవర్‌తో పాటు, సిటీ డ్రైవింగ్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంటుంది. వెలుపల బోల్డ్ లుక్‌తో పాటు, లోపల అధునాతన సాంకేతికత, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేలా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి:  RTC Bus Accident | ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *