అక్షరటుడే,ఆర్మూర్: MRPS Protest in Armoor | గ్రామ కమిటీల ఆగడాలను అరికట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వారి ఆగడాలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డికి, వీడీసీల చిత్రపటాలకు పిండప్రదానం చేశారు.
MRPS Protest in Armoor | అంబేడ్కర్ చౌరస్తాలో..
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), వీడీసీ చిత్రపటాలకు పిండ ప్రదానం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మైలారం బాలు మాట్లాడుతూ.. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో 39 గౌడ, 10 ఎస్సీ గీత కార్మిక కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ కమిటీలను రద్దు చేయాలన్నారు. పోలీసులు అక్కడికి నిరసనకారులను శాంతింపచేశారు.
ఇది కూడా చదవండి..: Indur Corporation Protest | అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్..: ఎమ్మెల్యే ధన్పాల్