Jeevan Reddy Arvind Remarks | అర్వింద్​ అంటేనే హాఫ్ నాలెడ్జి వ్యక్తి : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

అర్వింద్​ అంటేనే హాఫ్ నాలెడ్జి వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఎద్దేవా చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Jeevan Reddy Arvind Remarks | అర్వింద్​ (MP Arvind) అంటేనే హాఫ్ నాలెడ్జి వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఎద్దేవా చేశారు. నగరంలోని బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Jeevan Reddy Arvind Remarks | అహంకారం.. అవినీతికి అంగిలాగు తొడిగితే..

అహంకారం.. అవినీతికి, అబద్దాలకు అంగిలాగు తొడిగితే అది అర్విందేనని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. డీఎస్​ పేరు చెప్పుకుని 2004లో కాంగ్రెస్ బీ ఫాంలు అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని పగలు తిడతాడని.. రాత్రి ఆయన పొర్లు దండలు పెడతాడన్నారు. అర్వింద్​ ఎంపీగా గెలవడం నిజమాబాద్ జిల్లాకు దురదృష్టకరమని పేర్కొన్నారు. బనకచర్లను జనకచర్ల అని పలికే అర్వింద్​కు రాష్ట్రంను తీసుకొచ్చిన కేసీఆర్​ గురించి మాట్లాడేత అర్హత ఉందా అని ప్రశ్నించారు.

రేవంత్ పేటీఎం బ్యాచ్​లో అర్వింద్​ ఒక సభ్యుడని.. తెలంగాణ ఉద్యమంలో అర్వింద్​ పాత్ర అణా పైసా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంకెంత కాలం విషం కక్కుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిందే మొత్తం రూ.84వేల కోట్లు అయితే.. లక్షన్నర కోట్ల అవినీతి ఎక్కడి నుంచి జరిగిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్​హౌస్​కు వచ్చి సర్వే చేసుకోవాలని.. 700 ఎకరాలు ఉంటే ఆయనే తీసుకోవాలని జీవన్​ రెడ్డి సవాల్​ విసిరారు. సొంత సోదరుడిని మోసం చేసి అడుక్కుతినేలా చేసిన దగాకోరు అర్వింద్​ అని జీవన్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు జిల్లాలో ఎలాంటి పనులు చేస్తుందో రైతులకు వివరించాలని ఆయన కోరారు. సమావేశంలో జడ్పీ మాజీ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్​రావు, బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు సత్యప్రకాశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: MRPS Protest in Armoor | సీఎంకు పిండ ప్రదానం చేసిన ఎమ్మార్పీఎస్​ నాయకులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *