Gandhi Bhavan Meeting | గాంధీ భవన్​కు చేరిన నేతల ‘ఢిల్లీ పంచాయితీ’

పార్టీలో క్రమశిక్షణరాహిత్యంపై పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​ సీరియస్ అయ్యారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gandhi Bhavan Meeting | పార్టీలో క్రమశిక్షణరాహిత్యంపై పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​ సీరియస్ అయ్యారు. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల మధ్య పెరుగుతున్న క్రమశిక్షణా రాహిత్యం, విభేదాల అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha), జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుల మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి, ఈ అంశంపై చర్చించేందుకు గురువారం గాంధీ భవన్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని టీపీసీసీ చీఫ్ వారిద్దరినీ ఆదేశించారు. ఇతర నియోజకవర్గాల్లో ఇటీవల చోటుచేసుకున్న క్రమశిక్షణా రాహిత్య ఘటనలను కూడా పార్టీ పరిశీలించి, విచారణ చేపట్టనుంది.

Gandhi Bhavan Meeting | ఎమ్మెల్యే ఫిర్యాదుతో..

ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నవంబర్​ 1న ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాష్ట్రం నుంచి మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, నాయకులు వెళ్లారు. ఈ క్రమంలో జుక్కల్​ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తనను తీవ్ర పదజాలంతో దూషించారని ఎమ్మెల్యే పార్టీకి ఫిర్యాదు చేశారు.

Gandhi Bhavan Meeting | చర్యలు తీసుకుంటారా..

ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ గురువారం ఇద్దరు నేతలను గాంధీ భవన్​కు రావాలని సూచించారు. వారితో ఆయన చర్చించనున్నారు. ఇటీవల సీఎంపై కొండా సురేఖ కూతురు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజాగా ఓ ఎమ్మెల్యేలపై అందరి ముందు మంత్రి నోరు పారేసుకోవడంతో.. ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Fake Currency Racket | యూట్యూబ్​ వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *