Fake Currency Racket | యూట్యూబ్​ వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ

యూట్యూబ్​లో చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake Currency Racket | రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. చేతిలో స్మార్ట్​ఫోన్​ ఉండటంతో అందరికి సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అయితే దానిని మంచి కోసం వినియోగించే వారి కన్నా.. చెడు కోసం వాడే వారు ఎక్కువ అవుతున్నారు.

యూట్యూబ్​లో చేసి హత్యలు చేయడం, గూగుల్​లో నేర్చొకొని నేరాలకు పాల్పడుతున్న వారు ఉన్నారు. అంతేగాకుండా సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​ను ఉపయోగించి డ్రగ్స్​ దందా సైతం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్​లో వీడియోలు చూసి నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Fake Currency Racket | నలుగురి అరెస్ట్​

తెలంగాణ (Telangana)లోని కుంట్లూరు కేంద్రంగా నడుస్తున్న నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి, పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై నలుగురిని అరెస్టు చేశారు. నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ఓ కారును ఆపారు. అందులో తనిఖీ చేయగా.. రూ.8 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నాయి. వారిని విచారించగా.. కుంట్లూరు కేంద్రంగా నడుస్తున్న దందా విషయం తెలిసింది. అక్కడ తనిఖీ చేయగా.. పంపిణీకి సిద్ధంగా ఉన్న రూ.6.70 కోట్ల విలువైన ఫేక్​ కరెన్సీ నోట్లు లభించాయి.

Fake Currency Racket | కొనసాగుతున్న దర్యాప్తు

ప్రధాన నిందితుడు కరుణాకర్, యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని వీడియోలను చూసి నకిలీ కరెన్సీని ముద్రించే ప్రక్రియను నేర్చుకున్నాడు. అనంతరం కుంట్లూరులో నోట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచే వాటిని పంపిణీ చేసేవాడు. అసలు నోట్లు ఇస్తే.. అంతకు రెండు, మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పేవాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇతర నిందితులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతకాలంగా నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత మొత్తం చలామణిలోకి తెచ్చారనే వివరాలను సేకరిస్తున్నారు. నిందితులు డమ్మీ పిస్టళ్లను సైతం తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Ventilators Theft | వెంటిలేటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *