KTR Comments | భూములు అమ్మే బ్రోకర్​ రేవంత్​రెడ్డి.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

భూములు అమ్మే బ్రోకర్​ రేవంత్​రెడ్డి అని కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Comments | బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి భూములు అమ్మే బ్రోకర్​ అన్నారు. అడువులను నరికే వీరప్పన్​ను అటవీ శాఖ మంత్రి చేస్తే ఎలా ఉంటుందో.. భూములు అమ్మే రేవంత్​రెడ్డిని సీఎం చేస్తే అలా ఉందన్నారు.

హైదరాబాద్​ (Hyderabad) నగరానికి చెందిన పలువురు కాంగ్రెస్​ నాయకులు బుధవారం బీఆర్​ఎస్​లో చేరారు. తెలంగాణ భవన్​లో వారికి కండువాలు కప్పి కేటీఆర్​ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏడాదిలోపు మళ్లీ కేసీఆర్​ సీఎం అవుతారన్నారు. రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆశపడి హిల్ట్ పాలసీ స్కాంలో భూములు కొంటే తిరిగి అనుభవిస్తారని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ఇప్పుడు జరుగుతున్న భూదందాలన్నింటికీ చెక్ పెడతామన్నారు.

KTR Comments | ఆ భూములు పేదలకు ఇవ్వాలి

కేసీఆర్ ఫాంహౌజ్ వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు కాల‌నీ క‌ట్టిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మియాపూర్ భూముల్లో కట్టి ఇవ్వాలని కేటీఆర్​ అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో ప‌నిచేసిన వారికి మియాపూర్ భూములు ఇస్తే తాము వద్దంటామా అన్నారు. మియాపూర్‌లో 550 ఎకరాల వస్తే అమ్మాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతా భూమిలో పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టిస్తే స్వాగతిస్తామన్నారు. భూములు అమ్మడం.. కేసీఆర్​ణు తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలప్పుడు 3 నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. గద్దెనెక్కి మూడేళ్లవుతున్నా రేవంత్ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Gandhi Bhavan Meeting | గాంధీ భవన్​కు చేరిన నేతల ‘ఢిల్లీ పంచాయితీ’

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *