అక్షరటుడే, కామారెడ్డి: Elderly Woman Robbery | వృద్ధురాలిని బెదిరించి, దాడిచేసి ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన నిందితుడిని మాచారెడ్డి పోలీసులు(Machareddy Police) అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు.
Elderly Woman Robbery | గజ్యానాయక్ తండాకు చెందిన వృద్ధురాలు..
ఈనెల 21న మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో గజ్యానాయక్ తండాకు చెందిన 88 ఏళ్ల వృద్ధురాలు ఆగుళ్ల ఈరమ్మ మాచారెడ్డి చౌరస్తాలోని కల్లు దుకాణం వద్ద నుంచి ఇంటికి తిరిగి వెళ్తోంది. అయితే ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెను ఆటోలో ఎక్కించుకుని చుక్కాపూర్ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ వృద్ధురాలిని బెదిరించి, చేతులతో కొట్టి, ఆమె వద్ద ఉన్న వెండి కడియాలు, ఒక గ్రాము బరువున్న బంగారు ముక్కుపుడకతో పాటు సంచిలోని కొంత నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Elderly Woman Robbery | ఎస్పీ ఆదేశాల మేరకు..
ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, మాచారెడ్డి ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించారు. గురువారం మాచారెడ్డి పోలీసులు నిందితుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన సాయులును విచారించారు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వ్యక్తిగత ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి నాలుగు వెండి కడియాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు.
ఇది కూడా చదవండి: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! బంగారం ధరలు పడిపోయాయ్..