అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paddy Transportation Process | కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. పెర్కిట్ శివారులో మెప్మా( MEPMA), సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
Paddy Transportation Process | ధాన్యం సేకరణపై ఆరా..
రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ (nizamabad collector) పరిశీలించారు. రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు.. రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ల లారీలు వెళ్తున్నాయి అని విచారించారు. ట్రక్ షీట్లు(Truck Sheets) వెంటవెంటనే తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు(ట్యాబ్ ఎంట్రీ) చేస్తున్నారా.. హమాలీలు సరిపడా సంఖ్యలో ఉన్నారా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ధాన్యం తరలింపును వేగంగా చేపట్టాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అవసరమైతే హామీలీల సంఖ్యను పెంచాలని, ధాన్యం రవాణాకు సరిపడా లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
Paddy Transportation Process | కాలయాపన చేయవద్దు..
17 శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన చేయవద్దని కలెక్టర్ సూచించారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటవెంటనే అన్లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయన్న, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీఎం ప్రవీణ్, డీసీవో ఎన్.శ్రీనివాస్ రావు, తహశీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Single Screen Theatres | పర్సంటేజీ విధానంతోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ : ఎగ్జిబిటర్స్

