Paddy Lorry Accident | ధాన్యం లారీ బోల్తా..తప్పిన పెను ప్రమాదం

Shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట : Paddy Lorry Accident | ధాన్యం తరలిస్తున్న లారీ బోల్తా (lorry overturn) పడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి(Yellareddy) మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Paddy Lorry Accident | రైతులకు తప్పని కష్టాలు..

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు విక్రయ కష్టాలు (farmer problems) తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాలు జరగడం ఒక ఎత్తయితే.. ధాన్యాన్ని రైస్​మిల్లులకు తరలించే (grain transport) కార్యక్రమం ఒక ఎత్తవుతోంది. మండల కేంద్రంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైస్​మిల్​కు బయలుదేరిన లారీ మార్గమధ్యలో ట్రాక్టర్​ను తప్పించబోయి బోల్తా కొట్టింది. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్​ లేకపోవడం, డ్రైవర్​కు ఏమి కాకపోవడం ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి ఎస్సై దీపక్ కుమార్ చేరుకొని (Yellaredddy police) ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా చూశారు. రోడ్డుపై పడ్డ ధాన్యం బస్తాలను స్థానిక రైస్​మిల్​కు (rice mill issue) తరలించారు.

Paddy Lorry Accident | ముందే హెచ్చరించిన ‘అక్షరటుడే’

ధాన్యం బస్తాలను తరలించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గతంలోనే ‘అక్షరటుడే’లో ‘రైతులకు ధాన్యం విక్రయ కష్టాలు’ శీర్షికతో కథనం ప్రచురించింది. కొనుగోలు కేంద్రం నుంచి రైస్​మిల్​కు ధాన్యం వెళ్లేవరకు రైతులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారని పేర్కొంది. కేకేవై రహదారిపై లారీల నిర్లక్ష్యం కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల కష్టం రోడ్డుపాలవుతోందని కథనంలో పేర్కొంది. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారంటున్నారు. ఇప్పటికైనా లారీల నిర్వాహకులకు, కేంద్రం నిర్వాహకులకు ఆదేశాలివ్వాలని రైస్​మిల్లులకు వెళ్లేవరకు జాగ్రత్తగా వాహనాలు డ్రైవ్​ చేసేలా డ్రైవర్లకు సూచనలివ్వాలని వారు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Vijay Thalapathy | దళపతి @ జననేత.. తమిళనాడు రాజకీయాల్లో ‘విజయ్’ శకం మొదలు!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *