Parle Biscuit Factory Clash | బిస్కెట్​ ఫ్యాక్టరీలో గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

బీహార్​లో నుంచి వచ్చిన కూలీలు కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Parle Biscuit Factory Clash | బీహార్​లో నుంచి వలస వచ్చిన కూలీలు కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టుకున్నారు. ఈ ఘటన నగర శివారులోని ఖానాపూర్​ పార్లె బిస్కెట్​ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది.

Parle Biscuit Factory Clash | కుటుంబ కలహాల నేపథ్యంలో..

నిజామాబాద్​ (Nizamabad) రూరల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్​లో పార్లె బిస్కెట్​ ఫ్యాక్టరీలో బీహార్​ నుంచి వలస వచ్చిన కూలీలు పని చేస్తున్నారు. అయితే బీహార్​లో వారి నివాసం వద్ద జరుగుతున్న గొడవల నేపథ్యంలో కార్మికులు ఫ్యాక్టరీలో గొడవపడ్డారు. ఈ క్రమంలో బాధితుడు ధీరేంద్రనాథ్​పై అనిల్​ నాద్​ దాడి చేశాడు. ఈ ఘటనో ధీరేంద్రనాథ్​ కుడిచెవి కట్​ అయ్యింది. సమాచారం అందుకున్న రూరల్​ పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకుని బాధితుడికి జీజీహెచ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Yellareddy Road Works | పెండింగ్‌ రోడ్డు పనులపై ఎమ్మెల్యే మదన్​మోహన్​ ప్రత్యేక దృష్టి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *