అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anasuya cyber harassment | సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు ముప్పు కూడా అధికమవుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.
ఇదే నేపథ్యంలో నటి అనసూయ భరద్వాజ్ anasuya bharadwaj కి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులు పెడుతూ, ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని, దీనికితోడు ఏఐ టెక్నాలజీ ద్వారా అభ్యంతరకర వీడియోలు సృష్టిస్తూ తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అనసూయ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టుల లింకులు, ఫొటోల ఆధారాలను ఆమె సమర్పించారు.
Anasuya cyber harassment : అశ్లీల కంటెంట్..
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు Police కేసును సీరియస్‌గా తీసుకుని సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నల్గొండ జిల్లా, అల్వాల్ గ్రామానికి చెందిన దోరెపల్లి చంటి అనే యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
2025 సంవత్సరం నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనసూయను లక్ష్యంగా చేసుకుని అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు అభ్యంతరకర భాషను ఉపయోగిస్తూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసేలా కంటెంట్ సృష్టించినట్లు విచారణలో తేలింది.
ఈ మేరకు చంటిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 75, 79, 336(4), 351, 356తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్లు 66E, 67 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Anasuya cyber harassment | తీవ్ర ట్రోలింగ్
గత కొంతకాలంగా అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను Trolling ఎదుర్కొంటున్నారు. విజయ్ దేవరకొండతో జరిగిన వివాదం, అలాగే శివాజీతో సంబంధిత కాంట్రవర్సీల సమయంలో కూడా ఆమెను కొందరు నెటిజన్లు, అభిమానులు తీవ్రంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ట్రోలింగ్‌కు ఆమె కూడా దీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఇటీవల పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చడంతో తన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలుగుతోందని భావించిన అనసూయ చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించారు.
ఈ ఘటనతో సోషల్ మీడియా వేదికల వినియోగంపై బాధ్యతాయుత ప్రవర్తన అవసరంపై మరోసారి చర్చకు దారితీసింది. మహిళలపై ఆన్‌లైన్ వేధింపులు, డిజిటల్ దాడులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Harish Rao Delhi Visit | హరీశ్‌రావు అందుకే ఢిల్లీ వెళ్లారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

