Bandla Ganesh | నీకెందుకురా.. ప్రకాశ్​రాజ్​పై బండ్ల గణేశ్​ ఫైర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandla Ganesh | సినీ నటుడు ప్రకాశ్​రాజ్ (Prakash Raj)​కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్​ కౌంటర్​ ఇచ్చారు. పవన్​కు మద్దతుగా ప్రకాశ్​రాజ్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశ్​ రాజ్​ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. తరచూ బీజేపీ వ్యతిరేక పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని సైతం విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇటీవల పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan) తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన ట్వీట్​ చేశారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి అని సెటైర్లు వేశారు

Bandla Ganesh | నీ అడ్రస్​ తెలుసుకో..

ప్రకాశ్​రాజ్​కు పోస్టు బండ్ల గణేశ్​ కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో ఎందుకు వేలు పెడతావంటూ ప్రశ్నించారు. నీకెందుకురా.. ప్రతి దాంట్లో వేలు పెడతావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు నువ్వెవరు అని ప్రకాశ్​రాజ్​ను ప్రశ్నించారు. తమిళోడివా, తెలుగోడివా, కన్నడిగుడివా అన్నారు. ప్రతి విషయంలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా అని విమర్శించారు. అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకని సెటైర్లు వేశారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో అని హితవు పలికారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, బండ్ల గణేశ్ మధ్య ఎక్స్‌ వేదికగా జరుగుతున్న వార్.. చర్చనీయాంశంగా మారింది.

 

దీనిని కూడా చదవండి : Janhvi Kapoor Tirumala | శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *