అక్షరటుడే, వెబ్‌డెస్క్: DA hike for employees | ఉద్యోగులకు సంబంధించిన రెండు డీఏల మంజూరుకు మార్గం సుగమమైంది. రెండు డీఏల మంజూరుకు కేబినెట్ ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఫైల్‌ను పంపినట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే డీఏ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రెండు డీఏలకు సంబంధించి 3.64 శాతం, 2.73 శాతం చొప్పున పెంపు ఉండనుంది. ఈ రెండు డీఏలను కలిపితే మొత్తం 6.37 శాతం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 33.67 శాతం డీఏకు మరో 6.37 శాతం కలిపితే కొత్త డీఏ 40.04 శాతానికి చేరనుంది.
CEC House Attack | సీఈసీ పూర్వీకుల ఇంటిపై నల్లరంగుతో రాతలు.. ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు
DA hike for employees | అక్టోబర్ జీతం నుంచే అమలు
కేబినెట్ ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడితే, పెరిగిన డీఏను అక్టోబర్ నెల జీతం నుంచే మంజూరు చేయనున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగులకు అక్టోబర్ జీతంలోనే పెరిగిన డీఏ ప్రయోజనం అందే అవకాశం ఉంది.
డీఏ లెక్కలు..
- మొదటి డీఏ: 3.64%
- రెండో డీఏ: 2.73%
- రెండు డీఏల మొత్తం: 6.37%
- ప్రస్తుత డీఏ: 33.67%
- కొత్త డీఏ: 40.04%
అయితే తుది అమలు, ఉత్తర్వుల జారీ తేదీ వంటి అంశాలు కేబినెట్ ఆమోదం అనంతరం ప్రభుత్వం జారీ చేసే అధికారిక ఉత్తర్వులపై ఆధారపడి ఉంటాయి.