LPU student protests | రణరంగంగా మారిన పంజాబ్ యూనివర్సిటీ

పంజాబ్​లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LPU student protests | పంజాబ్​లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) రణరంగంగా మారింది. ఓ విద్యార్థిపై అత్యాచారం జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది.

విద్యార్థులు శనివారం రాత్రి నిరసన చేపట్టారు. క్యాంపస్‌ను ధ్వంసం చేసి, భవనంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టారు. ఆదివారం ఉదయం వరకు ఆందోళనలు కొనసాగాయి. కొందరు విద్యార్థులు యూనివర్సిటీలోని కిటికీ అద్దాలను, పూల కుండీలను ధ్వంసం చేశారు. అంతేగాకుండా జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని దిగ్భందించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.

LPU student protests | అత్యాచారం జరిగిందని..

క్యాంపస్‌లో ఒక నిర్మాణ కార్మికుడు ఒక విద్యార్థినిపై అత్యాచారం చేశాడని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం ఆమెను యాజమాన్యం ఇంటికి పంపగా.. ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. దీంతో నిరసనలకు పిలుపునిచ్చారు. మొదట్లో శాంతియుతంగా జరిగిన నిరసనలు అనంతరం హింసాత్మకంగా మారాయి. పోలీసులు మాట్లాడుతూ.. అత్యాచార ఘటన జరిగినట్లు తమకు సమాచారం లేదని తెలిపారు. అత్యాచారం జరిగినట్లు పుకార్లు వ్యాపించాయన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్పందిస్తూ.. వదంతులను పట్టించుకోవద్దని సూచించింది. క్యాంపస్‌లో విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని భరోసా ఇచ్చింది.

దీనిని కూడా చదవండి : CDPO Caught by ACB | అంగన్​వాడీ కేంద్రాల నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన సీడీపీవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *