అక్షరటుడే, హైదరాబాద్: Modi Telangana Visit | దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణ (Telangana)కు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Modi Telangana Visit | అభివృద్ధి పనులకు శ్రీకారం:
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) రాష్ట్రంలో పూర్తయిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయడంతో పాటు, మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ఆయన సమీక్ష జరిపే అవకాశం ఉంది.
Modi Telangana Visit | భారీ బహిరంగ సభ:
ప్రధాని రాకను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) సన్నద్ధమవుతోంది. ఈ సభకు లక్షలాది మంది ప్రజలను తరలించేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వస్తుండటంతో, ఈ వేదిక ద్వారా ప్రధాని ఇచ్చే సందేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Modi Telangana Visit | హ్యాట్రిక్ విజయం తర్వాత:
ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత తెలంగాణ గడ్డపై మోదీ అడుగుపెడుతుండటంతో బీజేపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనే సంకేతాన్ని పంపడంతో పాటు, రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాలపై కూడా ఈ పర్యటన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Vikram-1 Rocket | నింగిలోకి ‘విక్రమ్-1 రాకెట్.. ప్రారంభించిన సీఎం రేవంత్.

