Free Police Training | నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ప్రారంభించిన సీపీ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సీపీ సాయి చైతన్య సోమవారం ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Free Police Training | నిరుద్యోగ యువతకు పోలీస్​ శాఖ అండగా నిలిచింది. 60 రోజుల ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సోమవారం ప్రారంభించారు. 200 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు.

పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని గిరిరాజు ప్రభుత్వ కాలేజీ ఆడిటోరియంలో సీపీ (CP Sai Chaitanya) ప్రారంభించారు. కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ తదితర ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా వారిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 Free Police Training | 60 రోజుల పాటు ఉచిత శిక్షణ

ఈ ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్‌కు చెందిన భాగ్య కిరణ్ ఇన్​స్టిట్యూట్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, నిపుణులతో శిక్షణ అందించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ తరగతులు సాగుతాయని సీపీ తెలిపారు.

 Free Police Training | యువత లక్ష్యాన్ని సాధించాలి

సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. పోలీస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ 60 రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు.

ఇది కూడా చదవండి..: BRS Dharna | హామీలు అమలు చేయాలి.. కలెక్టరేట్​ ఎదుట బీఆర్​ఎస్​ ధర్నా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *