Hijra Mafia | హిజ్రా మాఫియా వెనక కాంగ్రెస్ హస్తం : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

రాష్ట్రంలో హిజ్రా మాఫియా వెనుక కాంగ్రెస్​ హస్తం ఉందని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hijra Mafia | రాష్ట్రంలో కొందరు హిజ్రాలు రెచ్చిపోతున్నారు. గృహ ప్రవేశం, పెళ్లిలు, షాప్​ ఓపెనింగ్​లు ఉంటే వచ్చి భారీగా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.

హిజ్రాల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హైదరాబాద్​ (Hyderabad) నగరం నుంచి మొదలు కొని మారుమూల గ్రామాల వరకు హిజ్రాలు డబ్బుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇంట్లో శుభకార్యం చేసుకోవాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక డ్రైవ్​ చేపట్టి హిజ్రాలపై చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్​ తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీఆర్​ఎస్​ నాయకుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజ్రా మాఫియా ముఠాల వెనక కాంగ్రెస్ హస్తం ఉందన్నారు.

Hijra Mafia | వసూళ్లు చేస్తే నేరం

డీజీపీ, రేవంత్ రెడ్డి లాగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రవీణ్​కుమార్​ అన్నారు. అసలా హిజ్రాలా, నకిలీ హిజ్రాలా అన్నది సమస్య కాదని, ఎవరు బలవంతపు వసూళ్లు చేసినా అది నేరమే అన్నారు. ఈ హిజ్రాలుగా నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మాఫియా వెనక ఉన్నది స్థానిక కాంగ్రెస్ నాయకులు కాదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లు రోజూ దండుకున్న డబ్బుల్లో కొంత వాళ్లకు చేరుతున్నందుకే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. లేకపోతే ఈ గ్యాంగ్​లకు ఎక్కడెక్కడ ఫంక్షన్లు ఉంటాయో ఎట్ల తెలుసని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులు ఒక సిట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

Hijra Mafia| టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేయాలి

హిజ్రాలలో కూడా మంచి వాళ్ళు ఉంటారని ఆయన అన్నారు. చట్టప్రకారం పని చేసి పొట్ట నింపుకునే వాళ్ళు ఉంటారని తెలిపారు. వాళ్లని చేరదీసి, శిక్షణ ఇచ్చి, యూనిఫాం ఇచ్చి వాళ్లతో రెండు టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాలని ప్రవీణ్​కుమార్​ సూచించారు. వారితోనే ఈ మాఫియా నడుపుతున్న కాంగ్రెస్-హిజ్రా గూండాలను కంట్రోల్ చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి.. : Harish Rao Comments | ఇది శాసనసభనా లేక కౌరవసభనా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *