Cannabis Seizure | పూణే ఎయిర్​పోర్టులో గంజాయి పట్టివేత

పూణే ఎయిర్​పోర్టులో అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cannabis Seizure | పూణే (Pune) అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు సుమారు రూ. 3.72 కోట్ల విలువైన 10.642 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

‘ఫ్రీజ్ డ్రైడ్ మోంతోంగ్ దురియన్’ అని లేబుల్ వేసిన తొమ్మిది వాక్యూమ్-సీల్డ్ ప్యాకెట్లలో ఈ నిషేధిత సరుకును దాచి, ప్రయాణికుడి చెక్-ఇన్ బ్యాగేజీలోని నూడిల్ ప్యాకెట్లతో సహా వాణిజ్య ఆహార పదార్థాల మధ్య ఉంచారు. అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి, నవంబర్ 18 వరకు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.

Cannabis Seizure | డ్రై ఫ్రూట్స్​ పేరుతో..

కస్టమ్స్​ అధికారులు మాట్లాడుతూ.. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితుడు అధికారులకు చిక్కకుండా థాయ్‌లాండ్‌లో విక్రయించే ‘దురియన్’ అనే డ్రైఫ్రూట్స్​ లేబుల్ ఉన్న ప్యాకేజీలలో ఈ నిషేధిత పదార్థాన్ని దాచి ఉంచాడు. అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.10.6 కిలలో హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు. దీని విలువ కిలోకు రూ.35 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి..: YSR Jagan KTR Vijay | ఒకే ఫ్రేమ్‌లో పొలిటికల్ & సినీ దిగ్గజాలు.. చెన్నై పెళ్లి వేడుకలో జగన్, కేటీఆర్, విజయ్ సందడి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *