Government ITI Admissions | ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government ITI Admissions | ఎల్లారెడ్డిలోని(Yellareddy) ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు(ITI Admissions) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రూపా నాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Government ITI Admissions | పదో తరగతి పాసైన విద్యార్థులు..

పదో తరగతి(SSC) పాసైన అభ్యర్థులు వచ్చేనెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్, మెకానిక్, ఇంజినీర్ డిజైనింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్ (Industrial Robotics) అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, సీఎన్‌సీ మిషన్ టెక్నీషియన్​లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ఈ సదవకాశాన్ని వినియోగివంచుకోవాలని సూచించారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *