అక్షరటుడే, ఇందూరు: Common School | రాష్ట్రంలో కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీటీఎఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
వీటిపై చర్చించేందుకు తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో(TPTF) నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు నిజామాబాద్ సౌత్ మండల కేంద్రంలో కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు.
Common School | నాణ్యమైన విద్య..
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని వెనిగళ్ల సురేష్ అన్నారు. విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టీపీటీఎఫ్ లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్ (Hyderabad)లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 30న ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ‘సమరశీలతత్వాన్ని చాటుకుందాం.. విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందన్నారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Common School | జాతీయ విద్యావిధానం.. సామాజిక న్యాయం..
రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ కె. నవీన్ నికోల ఐఏఎస్ హాజరుకానున్నారని.. గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారని సురేష్ తెలిపారు. జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయంపై ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ (Telangana)లో విద్యా అసమానతలపై ప్రొఫెసర్ కాసిం, అంతర్జాతీయ రాజకీయాలపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగర్ల సురేష్, ప్రధాన కార్యదర్శి పూదరి అర్వింద్, ప్రతినిధులు గోపి, సాయి, శ్రీహరి రావు, శ్రీలక్ష్మి, రామచంద్ర గైక్వాడ్, సునీత, రాములు, రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Pocharam Project | పోచారం ప్రాజెక్ట్ భద్రతను పరిశీలించిన నిపుణుల బృందం..

