అక్షరటుడే, భీమ్‌గల్: SIR Review Bheemgal | ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భీమ్‌గల్ (Bheemgal) పట్టణం వెనుకబడిన నేపథ్యంలో ఆయన భీమ్‌గల్ పట్టణంలో పరిస్థితిని సమీక్షించారు.
SIR Review Bheemgal | పట్టణంలోని ఆయా వార్డుల్లో..
పట్టణంలోని మొదటి వార్డుతో పాటు 171వ పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ సాగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో నాగేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ప్రతిఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. బూత్‌స్థాయి నాయకులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా వేగం పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, ఆరెపల్లి నాగేంద్ర, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, సంగ్యానాయక్, పర్స అనంతరావు, జేజే నర్సయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Tenant Farmer Death | పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లి కౌలు రైతు మృతి