Tenant Farmer Death | పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లి కౌలు రైతు మృతి

పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లిన రైతు మృతి చెందాడు. ఈ ఘటన పాత బాన్సువాడలోని శాంతినగర్​లో చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Tenant Farmer Death | పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లిన రైతు మృతి చెందాడు. ఈ ఘటన పాత బాన్సువాడ (Banswada)లోని శాంతినగర్​లో చోటుచేసుకుంది.

Tenant Farmer Death | బురదలో పడటంతో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత బాన్సువాడలోని శాంతినగర్​ కాలనీకి చెందిన దేశాయిపేట్ నారాయణ (45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో నారాయణ తాను కౌలుకు చేస్తున్న పొలానికి  నీరు పారించేందుకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 7 గంటలైనా నారాయణ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య సుజాత అతడి కోసం పొలం వద్దకు వెళ్లింది.

ఉదయం సుమారు 8 గంటల సమయంలో పొలాల మధ్య ఉన్న మట్టి రోడ్డుపై నారాయణ మృతి చెంది ఉండడాన్ని ఆమె గుర్తించింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి వరి పంటకు నీరు పారించి ఇంటికి తిరిగి వస్తుండగా, వర్షం కారణంగా బురదగా మారిన నల్లరేగడి రోడ్డుపై కాలు జారి బోర్లా పడడంతో బురద నీటిలో శ్వాస ఆడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement Arvind | విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న రేవంత్​రెడ్డికి పుట్టగతులుండవ్​.. : ఎంపీ అర్వింద్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *