Medigadda L&T Fire | మేడిగడ్డలోని ఎల్​అండ్​టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. కాలిపోయిన కీలక ఫైళ్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medigadda L&T Fire | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు చెందిన కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేనసుకుంది. ఒక్కసారిగా మంటలు చేలరేగి కీలక ఫైళ్లు దగ్ధం అయ్యాయి.

అగ్ని ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలి బూడిదైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Medigadda L&T Fire | వివాదాల నేపథ్యంలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత కీలకం. ఈ బ్యారేజీ కుంగిపోవడంపై ఇప్పటికే ఎన్​డీఎస్​ఏ (NDSA) నివేదిక ఇచ్చింది. విజిలెన్స్​ విచారణ చేపట్టింది. భారీగా అక్రమాలు చోటు చేసుకోవడంతో పిల్లర్లు కుంగిపోయాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి ఫైళ్లు కాలిపోవడం అనుమానాలకు తావిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే కార్యాలయం అధిక భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా, ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

దీనిని కూడా చదవండి : Deputy Collector ACB Case | డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు మాములుగా లేవుగా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *