TG SSC Exam Fee | విద్యార్థులకు అలెర్ట్​..ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష ఫీజుల షెడ్యూల్ విడుద‌ల‌!

చివరి నిమిషంలో హడావుడి లేకుండా విద్యార్థులు ముందే ఫీజు చెల్లించాలని సూచించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TG SSC Exam Fee | తెలంగాణ Telangana పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించింది.

ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. చివరి నిమిషంలో హడావుడి లేకుండా విద్యార్థులు ముందే ఫీజు చెల్లించాలని సూచించారు.

TG SSC Exam Fee | ఆలస్య రుసుము వివరాలు..

సాధారణ గడువు ముగిసిన తర్వాత ఫైన్‌తో ఫీజు చెల్లించేందుకు హెచ్‌ఎంలకు అవకాశం కల్పించారు:

  • నవంబర్ 18 – డిసెంబర్ 1: రూ. 50 ఆలస్య రుసుము
  • డిసెంబర్ 3 – డిసెంబర్ 14: రూ. 200 ఆలస్య రుసుము
  • డిసెంబర్ 16 – డిసెంబర్ 28: రూ. 500 ఆలస్య రుసుము

TG SSC Exam Fee | ఆదాయ పరిమితిని బట్టి ఫీజు మినహాయింపు

అర్హులైన ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) విద్యార్థులకు రూ.125 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం పాఠశాలల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) సమర్పించాల్సి ఉంటుంది.

Akshara Today | Fearless Journalism, a Growing Voice for the People..

ఫీజు చెల్లింపులు, మినహాయింపుల సమాచారం కోసం విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను (HM) సంప్రదించాలని అధికారులు సూచించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *