అక్షరటుడే, వెబ్డెస్క్: Thenil Jail Escape | తమిళనాడు Tamil nadu లోని తేని సబ్-జైలులో సోమవారం Monday రాత్రి చోటుచేసుకున్న ఖైదీల పరారీ ఘటన తీవ్ర కలకలం రేపింది. అనారోగ్యం నెపంతో జైలు సిబ్బందిని నమ్మించి, దాడి చేసిన 17 మంది రిమాండ్ ఖైదీలు ఒకేసారి పారిపోయారు. అయితే, పోలీసులు అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 24 గంటల్లోనే 13 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు.
Thenil Jail Escape | నాటకీయంగా పరారీ
సోమవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో సెల్లోని ఒక ఖైదీకి మూర్ఛవ్యాధి వచ్చినట్లు తోటి ఖైదీలు అరిచారు. నిజమేనని నమ్మి లోపలికి వెళ్లిన డ్యూటీ గార్డుపై ఒక్కసారిగా దాడికి దిగారు. అతని నుంచి తాళాలు లాక్కొని, అడ్డువచ్చిన సిబ్బందిని తీవ్రంగా గాయపరిచి ప్రధాన ద్వారం గుండా పరారయ్యారు.
Thenil Jail Escape | డ్రోన్ సర్వైలెన్స్‌తో గాలింపు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు తేని, దిండిగల్, మధురై జిల్లాలతో పాటు కేరళ సరిహద్దుల్లో 17 ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. జైలు వెనుక ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కిన ఖైదీల కదలికలను డ్రోన్ల సాయంతో పసిగట్టి చుట్టుముట్టారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను మూసివేసి గాలింపు కొనసాగించారు. మంగళవారం నాటికి 13 మంది చిక్కగా, మిగిలిన నలుగురి కోసం వేట కొనసాగుతోంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Thenil Jail Escape | తొమ్మిది మంది సిబ్బందిపై సస్పెన్షన్
ఈ భారీ భద్రతా వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తొమ్మిది మంది జైలు సిబ్బందిని (ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో సహా) తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.