Stock Market Today | దూసుకెళ్లిన సూచీలు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. ముడిచమురు ధరలు పెరుగుతున్నా దేశీయ స్టాక్ మార్కెట్ రాణించింది. ఐటీ స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లు, ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో ముగిశాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Stock Market Today | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 62 పాయింట్లు తగ్గినా తర్వాత పుంజుకుని 874 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 28 పాయింట్లు తగ్గినా అక్కడినుంచి 268 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 964 పాయింట్ల లాభంతో 78,151 వద్ద, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 24,334 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,722 కంపెనీలు లాభపడగా 2,500 స్టాక్స్ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 90 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 89 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 స్టాక్ లాభపడగా.. 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 3.91 శాతం, కొటక్ బ్యాంక్ 3.37 శాతం, టీసీఎస్ 3.02 శాతం, రిలయన్స్ 2.59 శాతం, హెచ్యూఎల్ 2.17 శాతం లాభపడ్డాయి.

Top Losers : సన్‌ఫార్మా 0.87 శాతం, ట్రెంట్ 0.68 శాతం, ఎయిర్‌టెల్ 0.59 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.55 శాతం, ఇండిగో 0.40 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Polymer Currency Notes | త్వరలో పాలిమర్ నోట్లు.. మార్పు నకు ఆర్‌బీఐ సన్నాహాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *