అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bodhan Chain Snatching | నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి అపహరించుకుని పరారయ్యాడు.
Bodhan Chain Snatching | అనుమానితుల ఫొటోలు!
బాధితురాలి ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన అనుమానితుల ఫొటోలు పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.