అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Free Police Training | నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ (Telangana) పోలీస్ శాఖ తరపున కానిస్టేబుల్, ఎస్సైల ఉద్యోగాలకు (Police Recruitment) ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలో యువతకు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు.
Free Police Training | మూడు డివిజన్లలో..
ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం కమిషనరేట్ పరిధిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినట్లు సీపీ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూడు డివిజన్లలో ఈ పరీక్ష జరిగిందన్నారు. నిజామాబాద్ డివిజన్‌కు సంబంధించి విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కాలేజీలో, ఆర్మూర్ డివిజన్‌కు క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో, బోధన్ డివిజన్‌కు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు.
Free Police Training | అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా..
పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. పరీక్షా ప్రక్రియ సజావుగా , పారదర్శకంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించారని వివరించారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను ఎంపిక చేసి , వారికి పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, తదితర అంశాల్లో సమగ్ర శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీటీసీ, ట్రాఫిక్, సీసీఎస్ , ఏఆర్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు చెందిన ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Sumanth Driver Arrest | మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్