అక్షరటుడే, వెబ్‌డెస్క్: Doval Beijing Tour | జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం బీజింగ్‌కు చేరుకోనున్నారు. అక్కడి అధికారి వాంగ్ యీతో కలిసి భారత్-చైనా సరిహద్దు సమస్యపై ‘ప్రత్యేక ప్రతినిధుల’ స్థాయి చర్చల్లో పాల్గొంటారు. మంగళవారం ఇరు దేశాల మధ్య ఈ ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరగనుంది.
Doval Beijing Tour | ఉద్రిక్తతలను తగ్గించేందుకు..
వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడం, సైనిక ఘర్షణ పరిస్థితులను సద్దుమణిగేలా చేయడంపై భారత్, చైనాలు కృషి చేస్తున్న తరుణంలో ఈ చర్చలు జరుగనున్నాయి. జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్, చైనా భారీగా సైనికులు, సైనిక పరికరాలను మోహరించాల్సి వచ్చింది.
ఇటీవలి కాలంలో సైనిక, దౌత్యపరమైన స్థాయిలలో ఇరు దేశాల మధ్య అనేక విడతల చర్చలు జరిగాయి. LAC నుంచి సైనికుల ఉపసంహరణ, బలగాల విరమణ మరియు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా చర్చలు సాగనున్నట్లు తెలుస్తోంది.
Doval Beijing Tour | శాంతి, స్థిరత్వం కోసం..
దోవల్ మరియు వాంగ్ యీ మధ్య జరిగే చర్చల్లో LAC పరిస్థితి, సరిహద్దు శాంతి, సైనిక మోహరింపు, సరిహద్దు నిర్వహణ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావడానికి సరిహద్దులో శాంతి, స్థిరత్వం ప్రాథమిక అవసరమని భారత్ చెబుతూ వస్తోంది.
ఇది కూడా చదవండి..: Amrit Bharat Express | తెలంగాణ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..