Jhanda Balaji Jatara | భక్తిశ్రద్ధలతో జెండా బాలాజీ జాతర.. తరలివచ్చిన భక్తజనం

ఆర్మూర్​ పట్టణంలో జెండా బాలాజీ జాతరను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Jhanda Balaji Jatara | పట్టణంలో (Armoor) జెండా బాలాజీ జాతరను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అశేషంగా తరలివచ్చారు.

Jhanda Balaji Jatara | ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి పూజలు..

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) కుటుంబ సభ్యులతో కలిసి జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​పర్సన్​ గోనెలహరి రఘు, ఈఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం డప్పు వాయిద్యాల నడుమ జెండాను అంకాపూర్ గ్రామస్తులకు అందజేశారు. అంకాపూర్​లో 20 రోజుల పాటు పూజలు అందుకున్న జెండా అటు నుంచి జక్రాన్​పల్లి మండలం అర్గుల్, సిర్నపల్లి గ్రామాల మీదుగా చివరికి తిరుమలకు చేరుకుంటుంది.

muni eera

ఇది కూడా చదవండి: Warehouse Fire | హైదరాబాద్​లో భారీ అగ్నిప్రమాదం.. గోదాములో చెలరేగిన మంటలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *