Autos Bandh | ఆటోల బంద్​.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..

నేటి ఆర్ధరాత్రి నుంచి ఆటోల బంద్​ నేపథ్యంలో మంత్రి పొన్న ప్రభాకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Autos Bandh | తమ సమస్యల పరిష్కారం కోసం ఆటో, క్యాబ్​, వ్యాన్​ డ్రైవర్లు సోమవారం నుంచి బంద్​ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు నిరవధిక బంద్​ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమ్మెల వల్ల సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. హుస్నాబాద్​లో ఆయన మాట్లాడారు.

Autos Bandh | సంక్షేమ బోర్డు ఏర్పాటు

రాష్ట్రంలో 2015 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని వేస్తామని చెప్పారు. కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులతో పాటు రవాణా శాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్ల ఇబ్బందులను సైతం పరిగణనలోకి తీసుకుని వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Autos Bandh | ఈ-ఆటోలకు ప్రోత్సాహం

పాత ఆటోలను స్క్రాప్ చేసి.. కొత్తగా ఈవీ ఆటోలు కొనుగోలు చేసే డ్రైవర్లకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందజేస్తుందని మంత్రి తెలిపారు. దశలవారీగా ఈ–ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అంతేకాకుండా డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రోఫిట్మెంట్ కోసం కొత్త పథకాన్ని తీసుకువస్తామని చెప్పారు.

 

ఇది కూడా చదవండి..: Amrit Bharat Express | తెలంగాణ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *