Nizamabad Farmers Issues | రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..: మాజీ ఎమ్మెల్యే బిగాల

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Farmers Issues | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు. గురువారం ప్రకటన విడుదల చేశారు.

Nizamabad Farmers Issues | సాగునీరు అందక పంటలు ఎండిపోయి..

సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని బిగాల పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు సమయానికి పంట పెట్టుబడి అందక, యూరియా లభించక, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతూ, సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Nizamabad Farmers Issues | జల, థర్మల్​ విద్యుత్​ను సరిగ్గా వినియోగించుకోక..

రాష్ట్రంలో జలవిద్యుత్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని బిగాల గణేష్ గుప్తా అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని కారణంగా చూపిస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. సమస్యలకు అధికారులే కారణమన్నట్లుగా వారిని తప్పుబట్టడం, సస్పెన్షన్ల పేరుతో బెదిరించడం కంటే, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.

Nizamabad Farmers Issues | రైతు సమస్యను రాజకీయ కోణంలో వద్దు..

రైతుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా, వారి జీవనాధారమైన వ్యవసాయాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, రైతులకు తక్షణ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. రైతులకు సాగునీరు, విద్యుత్, పెట్టుబడి సాయం, నష్టపరిహారం అందించే వరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం.

ఇది కూడా చదవండి..: Kamareddy Traffic Problems | ట్రాఫిక్​తో టెన్షన్​..టెన్షన్​.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *