Aligina Bathukamma | ఇవాళ ఎందుకు బతుకమ్మ ఆడరు? ‘అలిగిన బతుకమ్మ’ అసలు కథ ఇదే..!

పూల శోభతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది. సరిగ్గా ఈ ఆరో రోజు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Aligina Bathukamma | పూల శోభతో తెలంగాణ  ( Telangana ) అంతటా పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది. సరిగ్గా ఈ ఆరో రోజు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చే ఆడపడుచులు, ఈ ఒక్క రోజు మాత్రం పూలకు దూరంగా ఉంటారు. బతుకమ్మ పండుగలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచే ఈ రోజు అమ్మవారిని ‘అలిగిన బతుకమ్మ’ లేదా ‘అర్రెం’ అని కొలుస్తారు. పల్లెల్లో ఎంతో ఉత్సాహంగా సాగే వేడుకల మధ్య ఈ ఒక్క రోజు బతుకమ్మలను ఎందుకు తయారు చేయరు? దీని వెనుక ఉన్న పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఇదే..

Aligina Bathukamma | అపచారం జరిగిందని నమ్మకం..

పూర్వం బతుకమ్మను పేర్చే క్రమంలో అనుకోకుండా మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందని, ఆ కారణంగానే బతుకమ్మ అలిగి ఏదీ స్వీకరించదని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు ఎక్కడా బతుకమ్మలను తయారు చేయరు, ఎలాంటి నైవేద్యం కూడా సమర్పించరు. కేవలం అమ్మవారి అలక తీరాలని మాత్రమే మనసారా ప్రార్థిస్తారు.

Aligina Bathukamma | అలసిసొలసిన జగన్మాతకు విశ్రాంతి..

మరో పౌరాణిక గాథ ప్రకారం.. దేవీభాగవతం ఆధారంగా నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలు ధరించి భండాసురుడు, చండముండల వంటి రాక్షసులను సంహరించింది. ఆ రాక్షస సంహారంతో తీవ్రంగా అలసిసొలసిన జగన్మాతకు ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆరో రోజు బతుకమ్మ ఆడరని చెబుతుంటారు. కాలక్రమేణా అదే ‘అలసిన బతుకమ్మ’గా, ఆ తర్వాత ‘అలిగిన బతుకమ్మ’గా రూపాంతరం చెందిందని పెద్దలు పేర్కొంటారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Traffic Problems | ట్రాఫిక్​తో టెన్షన్​..టెన్షన్​.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *