Harish Rao Criticism | అభయ హస్తం కాదు మొండి హస్తం.. కాంగ్రెస్​ పాలనపై హరీశ్​రావు విమర్శలు

కాంగ్రెస్​ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Criticism | కాంగ్రెస్​ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్​రావు ఎక్స్​ వేదికగా విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అభయ హస్తం పేరిట కాంగ్రెస్​ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ప్రజలకు మొండి హస్తం చూపిందన్నారు.

కాంగ్రెస్​ మేనిఫెస్టోకు మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఎక్స్​ వేదికగా హరీశ్​రావు స్పందించారు. గొప్పగా చెప్పుకున్న అభయహస్తం.. హామీలను అమలు చేయని మొండి హస్తంగా మారిందని విమర్శించారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, దానిని తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల క్రితం ఇదే రోజు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్​రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మూడేళ్లు గడిచినా ఆ హామీలకు దిక్కులేదన్నారు.

Harish Rao Criticism | సమాధానం చెప్పాలి

గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని హరీశ్​రావు ప్రశ్నించారు. దీనికి ఖర్గే, శ్రీధర్​బాబు, భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. తొలి క్యాబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందన్నారు. గాంధీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాంగ్రెస్.. గాంధీభవన్ సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేక పోవడం సిగ్గుచేటన్నారు. హామీలు అమలు చేయకుండా మూడేళ్లుగా ప్రజలను కాంగ్రెస్​ ప్రభుత్వం మభ్య పెడుతుందన్నారు. కాంగ్రెస్ నయవంచనను తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు.

ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar | విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి : మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *